జములమ్మ ఆలయానికి రూ.80 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

జములమ్మ ఆలయానికి రూ.80 లక్షల ఆదాయం

Nov 20 2026 1:07 AM | Updated on Nov 20 2026 1:07 AM

గద్వాలన్యూటౌన్‌: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయంలో టెంకాయల విక్రయం, కొబ్బరి చిప్పల సేకరణ, అమ్మవారికి సమర్పించే చీరలు, ప్రసాదాలు, టాయిలెట్ల నిర్వహణకు దేవాదాయ ధర్మాదాయశాఖ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరి, ఈఓ పురంధర్‌కుమార్‌ ఆద్వర్యంలో వేలం నిర్వహించారు. 2027 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 కాలపరిమితికి నిర్వహించిన వేలంతో రూ.80 లక్షల మేర ఆదాయం సమకూరింది. టెంకాయల విక్రయానికి 15మంది పోటీపడగా.. శ్రీనివాసులు అనే వ్యక్తి రూ.55 లక్షలకు దక్కించుకున్నారు. కొబ్బరి చిప్పల సేకరణ వేలంలో రవికుమార్‌ అనే వ్యక్తి రూ. 13.15 లక్షలకు, ప్రసాదం విక్రయ వేలంలో మల్లయ్య రూ. 6.24 లక్షలకు దక్కించుకున్నారు. చీరల వేలంలో సురేశ్‌ రూ. 5.15లక్షలకు, టాయిలెట్ల నిర్వహణను రూ. 32వేలకు కార్తీక్‌ అనే వ్యక్తి దక్కించుకున్నారు. కాగా టెంకాయల వేలంలో గతేడాది కంటే రూ. 2.50లక్షలు, కొబ్బరి చిప్పల సేకరణలో రూ. 1.30లక్షల ఆదాయం అధికంగా వచ్చింది. కాగా, టెండరుదారులు వేలం కన్నా ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చారు. ఒకరికొకరు పోటీ పడి ఎక్కువగా పాడకుండా గుడ్‌విల్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement