ఉత్సాహంగా జిల్లాస్థాయి బాలల విజ్ఞాన కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జిల్లాస్థాయి బాలల విజ్ఞాన కాంగ్రెస్‌

Nov 20 2026 1:07 AM | Updated on Nov 20 2026 1:07 AM

గద్వాలన్యూటౌన్‌: స్థానిక బాలభవన్‌లో గురువారం జిల్లాస్థాయి జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్‌ (ఎన్‌సీఎస్‌సీ) కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 180 మంది విద్యార్థులు 70 విజ్ఞాన ప్రాజెక్టులను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, వ్యర్థాల నిర్వహణ, సుస్థిర అబివృద్ధి తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా సైన్స్‌ అధికారి భాస్కర్‌ పాపన్న ప్రాజెక్టులను పరిశీలించారు. డా.కరుణాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ఆయా ప్రాజెక్టులలోని అంశాలను నిశితంగా పరిశీలించి, మూల్యాంకనం చేయడంతో పాటు న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. ఈ ప్రదర్శనలో ఉత్తనూరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి పవన్‌, శెట్టి ఆత్మకూర్‌ విద్యార్థిని పవిత్ర, శారద విద్యానికేతన్‌ విద్యార్థినులు ఫర్విన్‌ బేగం, అక్షర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం ప్రతిభకనబర్చిన విద్యార్థులకు భాస్కర్‌ పాపన్న ప్రశంసా పత్రాలు, మెమెంటోలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు వీరన్న, జైపాల్‌రెడ్డి, పరమేశ్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement