గొర్రెలు 6,87,052
రాజోళి: ఎల్‌నినో ప్రభావం మూగజీవాలకు తీవ్ర కష్టాలను తెచ్చి పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పంటల సాగును ఆగం చేసిన తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు.. గ్రాసం కొరతతో మూగజీవాలకు గుక్కెడు నీరు, ఆహారం దొరకనివ్వని రోజు లు స్పష్టంగా కనిపిస్తున్నాయని జిల్లాలోని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది స రైన వర్షాలు లేకపోవడంతో సాగు పంటలపై ప్రభా వం చూపింది. దీంతో చాలా వరకు పంటలు ఎండిపోగా.. ఇప్పటికే వాటిని రైతులు పశువులకు గ్రా సంగా వదిలేశారు. దీంతో అక్కడక్కడ చేతికొచ్చిన పంటల గ్రాసాన్ని పశు పోషకులు అధిక ధరలు చె ల్లించి ముందస్తుగా కొనుగోలు చేసుకుంటున్నారు.
ఆది నుంచి నిరాశే..
ఈ ఏడాది ఆది నుంచే వానలు ఆశాజనకంగా లేవు. వర్షాకాలంలో పంటలు వేసినప్పటికీ, సరైన వర్షాలు లేకపోవడంతో పాడి రంగానికి అవసరమయ్యే కంది, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేవలం బోర్లు, నీటి వనరులు ఉన్న చోట మాత్రమే అరకొరగా సాగయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలోని తుంగభద్ర, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరి నాట్లు పెద్దఎత్తున వేసేవారు. నదుల్లో నీరుండంటతో పంటలు సమృద్ధిగా పండేవి. వరితోపాటు, మొక్కజొన్న, వేరుశనగ పంటలు కూడా అధిక మొత్తంలో సాగు చేయడం వల్ల పశు పోషణకు సరిపడా గ్రాసం లభించేంది. దీంతో పశువులకు అవసరమయ్యే గ్రాసం గతేడాది రూ.1,400 ధర ఉన్న తౌడు బస్తా.. ప్రస్తుతం రూ.1,800– 2 వేల దాకా పలుకుతుంది. అలాగే కంది నూక రూ.వెయ్యి ఉండగా.. ప్రస్తుతం రూ.1,450లకు పెరిగింది. గతేడాది రూ.11 వేలు ఉన్న ట్రాక్టర్ వరి గడ్డి ప్రస్తుతం రూ.18 వేలకు పెరిగింది. దీంతో పాడి రైతులు విలవిలలాడుతున్నారు. ఒక ట్రాక్టర్ వరి గడ్డి 14 గేదెలకు 2 నుంచి 3 నెలలు మాత్రమే వస్తుంది. దీనికితోడు అసలు గ్రాసమే అందుబాటులో లేకపోవడంతో జిల్లాలోని పశు పోషకులు కొత్తకోట, కొల్లాపూర్, పెబ్బేరు పరిసర ప్రాంతాల నుంచి వరి గడ్డిని తీసుకువస్తున్నారు.
● మరోవైపు జిల్లాలో ఉన్న నీటి తొట్టెలు సైతం చాలా వరకు శిథిలావస్థకు చేరి నీటి నిల్వ లేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వేలల్లో ఉండే జీవాలకు తాగునీరు ఎలా అందిస్తుందో అర్థం కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
నివారణ చర్యలు ఫలించేనా?
రానున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టకుని ప్రభుత్వం పాడి రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కానీ, అది ఎంత వరకు రైతులకు అక్కరకు వస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా గ్రాసం పెంచేందుకు అవకాశం కల్పించింది. నీటి వనరులు ఉన్నచోట ఎకరాకు రూ.14 వేలు అందించనుంది. దీని ద్వారా ఫర్టిలైజర్, విత్తనాలు కొనుక్కొని గడ్డిని పెంచేలా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టింది. దీనికోసం గ్రామాల వారీగా దరఖాస్తులు తీసుకుంటుంది. వీటితోపాటు పశువులకు షెడ్లు వేసుకునేందుకు రూ.80 వేలు ఇవ్వనుంది. వీటికి సంబంధించి జిల్లాలో ఇప్పటికే 157 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రాసం కొరత తీవ్రమైతే మాత్రం క్యాంపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా నీటి వనరులు ఉన్నచోట గ్రాసం అందిస్తూ.. రెండు, మూడు గ్రామాల పశువులను ఒకే చోట క్యాంపుగా ఏర్పాటు చేసి, వారికి గ్రాసం కొరత రాకుండా కడపు నింపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కానీ, జిల్లాలో ఉన్న పశువుల సంఖ్యకు ఈ క్యాంపులు ఎంత వరకు కాపాడగలవని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతోతీవ్రమైన గ్రాసం కొరత
అక్కడక్కడ లభిస్తున్న గ్రాసానికి భారీగా పెరిగిన ధరలు
గ్రామాల్లో నీటి తొట్టెలకు కూడా దక్కని మోక్షం
ఇటు గ్రాసం.. అటు నీటి ఎద్దడితో మనుగడే ప్రశ్నార్థకం
ప్రత్యామ్నాయంగా క్యాంపుల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు
గేదెలు
70,564
ఆవులు
60,125
మేకలు
79,259


