మయూర వాహనంపై స్వామివారి వైభవం | - | Sakshi
Sakshi News home page

మయూర వాహనంపై స్వామివారి వైభవం

Nov 11 2026 1:19 AM | Updated on Nov 11 2026 1:19 AM

శ్రీదేవి, భూదేవి సమేతంగా మయూర వాహనంపై కొలువుదీరిన శ్రీకురుమూర్తి స్వామివారు మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ కొండపై వైభవంగా ఊరేగారు. మంగళవారం రాత్రి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ, పూలతో స్వాగతం పలుకుతూ భక్తులు తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. గోవింద నామస్మరణతో కురుమూర్తి కొండలు మారుమోగగా, మయూర వాహనసేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధాన ఆలయం నుంచి ఉద్దాల మండపం కమాను వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ బత్తుల బాల్‌రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – చిన్నచింతకుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement