ఎల్నినో కారణంగా నెలకొన్న కరువు నేపథ్యంలో పాడి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం తీవ్ర ప్రభావం ఉన్న చోట కరువు నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా గ్రాసం వృథా కాకుండా ఎలా పొదుపుగా వాడుకోవాలనే దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– వెంకటనారాయణ, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి
14 గేదెలు ఉన్నాయి..
మాకు 14 గేదెలు ఉన్నాయి. జిల్లాలో గడ్డి దొరకడం లేదు. కంది నూక, తౌడు, దాన, గ్రాసం ధరలు భారీగా పెరిగాయి. ఎలాగోలా ఇతర ప్రాంతాల నుంచి గడ్డి కొని తెచ్చినా 2, 3 నెలల్లోనే అయిపోతోంది. దీనిని ఎండాకాలం మొత్తం ఎలా నెట్టుకురావాలో తెలుస్తలేదు. ప్రభుత్వమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి పాడి సంపదను కాపాడాలి.
– రామకృష్ణారెడ్డి, పాడిరైతు, శాంతినగర్
●


