మన్యంకొండలో కార్తీక దీపోత్సవం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మన్యంకొండలో కార్తీక దీపోత్సవం ప్రారంభం

Nov 11 2026 1:13 AM | Updated on Nov 11 2026 1:13 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం ప్రారంభమైంది. ఆలయ సంప్రదాయ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే దీపారాధనలో భాగంగా మంగళవారం అర్చకులు రాజగోపురం ఎదుట ప్రత్యేకంగా కార్తీక దీపాన్ని వెలిగించారు. ఈ దీపం నెల రోజుల పాటు నిరంతరంగా వెలుగనుంది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement