గద్వాల న్యూటౌన్: మనిషికి ఎన్ని ఆస్తులున్నా.. చదువు లేకపోతే అవన్నీ వృథా అవుతాయని.. విద్యే నిజమైన సంపద అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం స్థానిక డీకే బంగ్లాలో శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చదువుకో తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభకనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సన్మానించారు. జిల్లా టాపర్‌గా నిలిచిన ఉత్తనూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని పవిత్రను డీకే అరుణ, డీకే స్నిగ్ధారెడ్డి సన్మానించి.. శ్రీరామ్ గ్రూప్ సహకారంతో రూ.లక్ష చెక్కును అందించారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.10 వేల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ గ్రూప్ సంస్థ చదువుకో తెలంగాణ అనే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు వెంకట్రాములు, రవికుమార్ ఎక్బోటే, వెంకటేశ్వర్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, శ్రీరామ్ గ్రూప్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలి
నడిగడ్డ రెడ్డి సేవాసమితి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికై న సమితి కార్యవర్గ సభ్యులు స్థానిక డీకే బంగ్లాలో డీకే అరుణ, డీకే స్నిగ్ధారెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గసభ్యులకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. నడిగడ్డలోని పేద రెడ్ల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. నడిగడ్డ రెడ్డిసేవా సమితి అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారి అశోక్‌కుమార్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.


