గద్వాల: తాను చేసిన మోసం నుంచి కప్పిపుచ్చుకు నేందుకు ఏకంగా అధికారులనే దొంగలుగా ముద్రవేసేందుకు కుట్రలు పన్నాడో రైస్‌మిల్లు ఓనర్. తనవద్ద ప్రభుత్వం తీసుకున్న ధాన్యం బస్తాలు సక్రమంగానే ఉన్నాయని బుకాయిస్తూ.. మళ్లీ ఒకసారి కౌంటింగ్ చేయాలని కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం సివిల్ సప్లయ్‌శాఖ అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. ఈ క్రమంలో సదరు రైస్‌మిల్లర్ చేసిన మోసం వెలుగు చూడటంతో అధికారులు అవాక్కయారు. ఇంతకీ మోసం చేసిన రైస్‌మిల్లర్ ఎవరు? ఏమిటా ధాన్యం బస్తాల లెక్కింపు కథ ఏమిటో మీరే చదవండి.
● గద్వాల మండలం కొత్తపల్లికి వెళ్లే మార్గంలో ఫరీదా రైస్‌మిల్లు ఉంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యం బస్తాలను లెక్కించేందుకు ఈ నెల 17న సివిల్ సప్లయ్‌శాఖ అధికారులు ఆ రైస్‌మిల్లుకు వెళ్లారు. అయితే ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యంలో 30వేల బస్తాలు తక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించి, నివేదికను ఉన్నతాధికారుల కు పంపడంతో సదరు ఫరీదా రైస్‌మిల్లుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. తనవద్ద ధాన్యం బస్తాలన్నీ సరిగ్గానే ఉన్నాయని.. అధికారులే తప్పుడు లెక్కలు చేశారని పేర్కొంటూ మళ్లీ కౌంటింగ్ చేయాల్సిందిగా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.
చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం
అధికారులపైనే దబాయింపు
రీ కౌంటింగ్‌లో బయటపడిన రైస్‌మిల్లర్ తతంగం


