నిర్వాసితులకు రూ.30లక్షల పరిహారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు రూ.30లక్షల పరిహారం ఇవ్వాలి

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

గద్వాల: గట్టు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న గట్టు, కేటీదొడ్డి మండలాల రైతులకు అనువైన భూములు లేదా ఎకరాకు రూ. 30లక్షల పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం బాధిత రైతులతో కలిసి కలెక్టరేట్‌లో ఎస్‌డీసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గట్టు ఎత్తిపోతల పథకం కుడి కాల్వ పరిధిలో కేటీదొడ్డి శివారులో 94 ఎకరాలు, ఎడమ కాల్వ పరిధిలో కుచ్చినెర్ల, రాయాపురం, చింతలకుంట, అప్పకొండహల్లి, మాచర్ల, బలిగెర గ్రామాల శివారులో 156 ఎకరాల భూములు ముంపునకు గురవుతున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 800 మంది రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. గతంలో భూమి సేక రించే సందర్భంగా ఎకరాకు రూ. 12లక్షల చొప్పున ఇస్తామని చెప్పి, కేవలం రూ. 6లక్షలు ఇచ్చి రైతులను నిలువునా మోసం చేశారన్నారు. ఈసారి అ లాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా లేరన్నారు. ఇప్పటికే జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో వేల ఎకరాల భూములు కోల్పోయ్యారని గుర్తుచేశారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సానుభూతితో వ్యవహరించి.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో రైతులకు చెల్లించిన తరహాలో ఎకరాకు రూ. 30లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు వీవీ నర్సింహ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement