ఎర్రవల్లి మండలం దువాసిపల్లిలోని రైస్‌మిల్లులో సుమారు 90వేల ధాన్యం బస్తాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 10కోట్ల మేరకు ఉంటుంది. అయితే ఈ మిల్లుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు రైస్‌మిల్లు యజమాని కొత్తగా గద్వాల మండలం అనంతపురం గ్రామ పరిధిలో మరో రైస్‌మిల్లు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం బ్లాక్మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నప్పటికీ.. అధికారుల నుంచి ఉలుకూ పలుకు లేదు. తాజాగా మరో బినామీ పేరుమీద కొత్త మిల్లు ఏర్పాటు చేసుకుని తనకున్న పలుకుబడితో పెద్దఎత్తున ధాన్యం కేటాయించుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదంతా బాహాటంగానే సాగుతున్నప్పటికీ అధికారులు మాత్రం కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.


