మూల్యం చెల్లించుకుంటారు | - | Sakshi
Sakshi News home page

మూల్యం చెల్లించుకుంటారు

Oct 28 2026 12:48 AM | Updated on Oct 28 2026 12:48 AM

జోగుళాంబ గద్వాల

బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

గద్వాల: ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యంలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటానని, అదేవిధంగా అక్రమార్కులకు సహకరిస్తే అధికారులు సైతం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. జిల్లాలోని పలు మిల్లుల్లో ఇటీవల విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించగా ధాన్యం నిల్వలలో తేడాలున్నాయని వాటన్నింటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో సివిల్‌ సప్లయ్‌ అధికారులు, మిల్లర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మిల్లర్ల అక్రమాలపై ‘సాక్షి’లో ‘అక్రమార్కులు.. అధికారులు చెట్టాపట్టాల్‌’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కొన్నేళ్లుగా ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యం సంబంధించి మిల్లర్లు సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహించారు. అలాగే తీసుకున్న ధాన్యానికి సంబంధించి నిల్వలు కూడా ఉండడం మండిపడ్డారు. తీసుకున్న ధాన్యానికి సీఎంఆర్‌ బియ్యం అప్పగించకుండా, ధాన్యం స్టాక్‌ లేకుండా మిల్లర్లు ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యానికి సంబంధించి స్టాక్‌ వివరాలపై మిల్లుల వారిగా యజమానులతో మాట్లాడారు. ధాన్యం నిల్వలలో వ్యత్యాసం ఉన్న మిల్లుల యజమానులపై మండిపడ్డారు. అలాగే గతంలో వేలం వేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించారు. నిల్వలలో వ్యత్యాసం ఉన్న మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని సివిల్‌ సప్లయ్‌ అధికారులను ఆదేశించారు.

అధికారులపై తీవ్ర ఆగ్రహం..

జిల్లాలోని నాలుగు మిల్లుల్లో ప్రభుత్వ వద్ద తీసుకున్న ధాన్యం నిల్వలలో వ్యత్యాసం ఉందని విజిలెన్స్‌ అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాకుండా గోప్యత పాటించడంపై అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే సదరు మిల్లులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి.. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ద్వారా ప్రభుత్వ సొమ్ము రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న ధాన్యానికి సంబంధించి చెల్లించాల్సిన సీఎంఆర్‌ బియ్యం అప్పగించని మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సివిల్‌సప్లయ్‌ అధికారులను నిలదీశారు. మూడు, నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టుకున్న మిల్లులకు మళ్లీ ఎందుకు ధాన్యాన్ని కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్‌ మాటలకు సమాధానం ఇవ్వడానికి తడబడిన అధికారులు నీళ్లు నమిలారు. అదేవిధంగా మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లర్ల అక్రమాలపై సీరియస్‌గా ఉన్నానని, ఎవరినీ సహించేంది లేదని, అక్రమాలకు పాల్పడే మిల్లర్లకు సహకరించే అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద తీసుకున్న సొమ్ముకు భద్రత కల్పించి కాపాడాల్సిన అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మిల్లర్ల అక్రమాలపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని ఇందులో ఎవరిని సహించేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం

ఉత్సాహంగా క్రికెట్‌ టోర్నీ

గద్వాలలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70వ రాష్ట్రస్థాయి అండర్‌–17 క్రికెట్‌ టోర్నీ ఉత్సాహంగా సాగుతోంది.

–8లో u

షోకాజ్‌ నోటీసులు..

గత కొన్నేళ్లుగా ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యానికి సంబంధించి చెల్లించాల్సిన సీఎంఆర్‌ బియ్యం పెట్టకుండా పెండింగ్‌లో ఉన్న మిల్లులకు వెంటనే షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సీఎంఆర్‌ ధాన్యాన్ని పక్కన పెట్టి ప్రైవేటు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసే మిల్లులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. డిఫాల్టర్స్‌పై ఇదివరకే జరిమానాలు విధించినట్లు, బకాయి చెల్లించకుంటే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, అదేవిధంగా ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ద్వారా ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును రికవరీ చేసుకోనున్నట్లు వెల్లడించారు. గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్లలో ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యానికి సంబంధించి సీఎంఆర్‌ బియ్యాన్ని 20రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో మిల్లులపై చర్యలు తప్పవన్నారు. దీంతోపాటు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న మిల్లుల వివరాలతో 15 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సివిల్‌సప్లయ్‌ అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది 2026– 27 ఖరీఫ్‌కు సంబంధించి బ్యాంకు గ్యారంటీ ఇచ్చే మిల్లులకే ధాన్యం కేటా యింపులు ఉంటాయని, మిల్లర్లు నవంబర్‌ 15లో గా గ్యారంటీ ఇవ్వాలన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సీఎంఆర్‌ ధాన్యం ప్రభుత్వానికి అవస రమని చెప్పారు. అలాగే చౌకధర దుకాణాల ద్వారా తెల్లరేషన్‌ కార్డుదారులకు వచ్చే సంవత్సరం ప్రతినెలా బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుందని, వస తి గృహాలు, విద్యాసంస్థలు వంటి ప్రభుత్వ అవసరాలకు బియ్యం నిల్వలు తప్పనిసరి అన్నారు. సమావేశంలో సివిల్‌సప్లయ్‌ డీఎం విమల, డీటీలు ప్రశాంత్‌గౌడ్‌, రాజేష్‌, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.

సీఎమ్మార్‌ అప్పగింతలో నిర్లక్ష్యం వహించే మిల్లర్లకు కలెక్టర్‌ వార్నింగ్‌

అక్రమార్కులకు సహకరిస్తే ఇక అంతే సంగతులు

ఆర్‌ఆర్‌ యాక్ట్‌

అమలు చేస్తామని హెచ్చరిక

ఇకపై బ్యాంకు గ్యారంటీ ఇచ్చే మిల్లులకే ధాన్యం కేటాయిస్తామని స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement