పోలీస్‌ అమరుల త్యాగం అజరామరం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అమరుల త్యాగం అజరామరం

Oct 28 2026 12:48 AM | Updated on Oct 28 2026 12:48 AM

గద్వాల క్రైం/ ఎర్రవలి: పోలీసు అమరవీరుల త్యాగం అజరామరమని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌, ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్‌ డే)ను పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. పోలీసు ఫ్లాగ్‌ డే వారోత్సవాల సందర్భంగా బీచుపల్లి పదో బెటాలియన్‌, పోలీసుశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సంక్షేమం కోసం విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసు సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. ఏ సమస్య వచ్చినా ముందుగా పోలీసు ఉన్నాడనే ధైర్యంతో ప్రజలు నమ్మకంగా ఉన్నారన్నారు. విపత్కర సమయాల్లోనూ బాధితులకు మనోధైర్యం ఇవ్వడంతోపాటు వారి అభ్యున్నతికి కృషి చేసేది పోలీసులు అన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. అలాగే పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌, ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో బెటాలియన్‌ కమాండెంట్‌ ఆదినారాయణ, అసిస్టెంట్‌ కమాండెంట్లు వెంకటరమణ, సారధిరెడ్డి, ఏఎస్పీ శంకర్‌, డీఎస్పీలు మొగిలయ్య, నరేందరావు, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

● బీచుపల్లి పదో పటాలంలో సరస్వతి పాఠశాల విద్యార్థులకు పోలీస్‌ సిబ్బంది వినియోగించే వివిధ పరికరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్‌ కమాండెంట్‌ ఆదినారాయణ హాజరై మాట్లాడారు. ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులకు పోలీసులు అంటే భయం పోతుందన్నారు. అలాగే సమాజంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కూడా బలపడుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం విద్యార్థులకు వివిధ రకాల ఆయుధాలపై స్వయంగా అవగాహన కల్పించి, పోలీసుల పనితీరు గురించి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement