‘కాంగ్రెస్‌ పార్టీ అనుకూల ఓట్లను తొలగించారు’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ పార్టీ అనుకూల ఓట్లను తొలగించారు’

Oct 28 2026 12:48 AM | Updated on Oct 28 2026 12:48 AM

అయిజ/ రాజోళి: దేశంలో సర్‌ కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసే చాలామందిని జాబితా నుంచి తొలగించారని ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం అయిజలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓటు బచావో– దేశ్‌ బచావో కార్యక్రమానికి ఎంపీ మల్లు రవితోపాటు అలంపూర్‌ ఇన్‌చార్జి దేవేంద్రదాస్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో బీజేపీ అనుకూల ఓట్లను కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అనుకూల ఓట్లను మాత్రమే తొలగించారని ఆరోపించారు. డిగ్రీ పూర్తిచేసిన వారిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేయించాలని మల్లురవి అన్నారు. రాజోళిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. డిగ్రీ పూర్తి చేసుకున్న పట్టభద్రులను గుర్తించి.. వారిని ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులను గుర్తించడం బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాముడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement