గద్వాల క్రైం: విజయ దశమిని పురస్కరించుకొని జిల్లా సాయుధ దళ కార్యాలయంలో సోమవారం ఆయుధ పూజ ఎస్పీ శ్రీనివాసరావు సతీసమేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చెడుపై విజయం సాధించిన తరుణంలో గుర్తుగా విజయ దశమి పండుగను నిర్వహించడం మన సంప్రదాయమన్నారు. సమాజంలో చెడును నిలువరించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపడుతుందన్నారు. అంతకు ముందు పోలీసుల ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలకు, సిబ్బందికి దసరా పండుగ శుభకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్‌రావు, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


