క్రీడలతో మానసిక వికాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక వికాసం

Oct 1 2026 1:11 AM | Updated on Oct 1 2026 1:11 AM

గద్వాలన్యూటౌన్‌: క్రీడలతో మానసిక వికాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని అడిషనల్‌ కలెక్టర్‌ నర్సింగ్‌రావు అన్నారు. బుధవారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో పీఎంశ్రీ పాఠశాలల ఆధ్వర్యంలో సీడబ్ల్యూఎస్‌ఎన్‌ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. అండర్‌–14, 17 విభాగాల్లో బాలబాలికలకు 50 మీ. 100 మీ. పరుగుపందెం, క్యారమ్స్‌, చెస్‌, లాంగ్‌జంప్‌, ఫ్రాగ్‌ జంప్‌, షాట్‌ఫుట్‌, జిగ్‌జాగ్‌ రన్‌ తదితర పోటీలు నిర్వహించగా.. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 129 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. సీడబ్ల్యూఎస్‌ఎన్‌ విద్యా ర్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయ డంతో పాటు ఆత్మవిశ్వాసం, స్వయం ప్రతిభ, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. క్రీడల్లో విజ యం సాధించడం కంటే.. ప్రయత్నించడం, ప్రతిభను ప్రదర్శించడం ముఖ్యమని తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెమోంటోలను ప్రదా నం చేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వాడీవేడిగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

గద్వాల: గద్వాల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది. బుధవారం చైర్‌పర్సన్‌ జయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిధుల దుర్వినియోగం, పదిశాతం స్థలాల ఆక్రమణపై దుమారం రేగింది. సమావేశం ప్రారంభమైన వెంటనే కౌన్సిలర్‌ రామలింగేశ్వర్‌ కామ్లే మాట్లాడుతూ.. భీంనగర్‌లోని పదిశాతం స్థలం ఉన్న సర్వేనం. 453పై కోర్టు స్టే ఉందని అంటున్నారని, ఆ పక్కనే ఉన్న 454పై ఎలాంటి స్టే లేదని, అక్కడ ఇంటి నిర్మాణం చేస్తున్నా ఎందుకు ఆపడం లేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. సర్వేనం. 56/68లోని పదిశాతం స్థలం కూడా అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే మున్సిపల్‌ ఖాతాలో జమ చేయకుండా దుర్వినియోగమైన రూ. 11.28లక్షలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీనిపై బీజేపీ కౌన్సిలర్లు రామాంజనేయులు, కుమ్మరి శ్రీనివాసులు మాట్లాడుతూ.. వసూలు చేసిన దుకాణాల అద్దె డబ్బులను ఎప్పటికప్పుడు ఖాతాలో ఎందుకు జమ చేయలేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యులుగా ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం సరైంది కాదన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఖాతాలో నిధులు జమచేసే విషయంలో కమిషనర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఆయనపై కూడా చర్యలు తీసుకోవాల ని పలువురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అన్నారు. సమావేశంలో వైస్‌చైర్మన్‌ శంకర్‌, కమిషనర్‌ జానకీ రాంసాగర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement