అలంపూర్: రాష్ట్ర సరిహద్దులో అక్రమ రవాణాకు అవకాశం లేకుండా పటిష్ట నిఘా ఉంచాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం అలంపూర్ పోలీస్‌స్టేషన్ తనిఖీ చేశారు. ముందుగా స్థానిక పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, యూనిఫామ్ టర్న్ ఔట్, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, బ్యారక్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల నుంచి వచ్చే సానుకూల స్పందనే పోలీస్ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించడంతో పాటు ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. ఆస్తి సంబంధిత, అధిక నేరాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించాలన్నారు. బీట్ డ్యూటీల ద్వారా నిఘా కట్టుదిట్టం చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు పోలీస్‌స్టేషన్ చెక్‌పోస్టుల వద్ద అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రౌడీ షీటర్స్, అనుమానితులపై నిఘా ఉంచడంతో పాటు గ్రామీణ ప్రజలతో మమేకం కావాలన్నారు. నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తుకు కీలకంగా ఉండే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు. బ్లూకోల్ట్ సిబ్బంది ప్రతి పాయింట్‌ను తనిఖీ చేయాలన్నారు. స్టేషన్ రికార్డులు పార్ట్–1, 5 పెండింగ్ లేకుండా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల నియంత్రణకు పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే నిత్యం వాహనాల తనిఖీ చేప ట్టాలని ఆదేశించారు. డయల్–112 కాల్స్‌కు సత్వ రం స్పందించాలని తెలిపారు. అలంపూర్ క్షేత్రానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్, ఎస్‌ఐ రామకృష్ణ ఉన్నారు.


