మహబూబ్‌నగర్ క్రీడలు: జాతీయస్థాయి యోగా పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రిత్విక్‌రెడ్డి (8–10 ఏళ్ల విభాగం), దౌసిక్ ప్రసాద్ (10–12 ఏళ్ల విభాగం), ఎం.శివతేజ (14–16 ఏళ్ల విభాగం), సీహెచ్ అఖిల్ (16–18 ఏళ్ల విభాగం)లకు మ్యాట్‌లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాకు మంచి గుర్తింపు ఉందని, మీరు జాతీయస్థాయిలో పతకాలు సాధించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి టి.చంద్రశేఖర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాజస్తాన్‌లో జాతీయస్థాయి యోగా పోటీలు జరుగుతాయని తెలిపారు. చెన్న వీరయ్య, జిల్లా యువజన, క్రీడలశాఖ అథ్లెటిక్స్ కోచ్ సునీల్‌కుమార్, బాల్‌రాజు పాల్గొన్నారు.


