డ్రగ్స్‌పై ఈగల్‌ ఫోర్స్‌ పటిష్ట నిఘా | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌పై ఈగల్‌ ఫోర్స్‌ పటిష్ట నిఘా

Sep 30 2026 12:52 AM | Updated on Sep 30 2026 12:52 AM

గద్వాల క్రైం: యువత భవిష్యత్‌, సంరక్షణ మన చేతుల్లోనే ఉందని ఈగల్‌ ఫోర్స్‌ విభాగ అధికారి పీవీ పద్మజ, ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో మాదకద్రవ్యాల అంశాలపై నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ప్రతిఒక్కరు కృషిచేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా నమోదైన గంజాయి కేసులు, సరఫరా చేసిన నిందితుల వివరాలపై ఆరా తీశారు. మత్తు వ్యసనాలకు బానిసలైన వారిని గుర్తించి వారిలో మార్పునకు తీసుకున్న చర్యలు, అవసరమైన చర్యలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడం, కొందరు వ్యవసాయేత భూములలో గంజాయి సాగు చేయడం, వారికి ఎక్కడి నుంచి విత్తనాలు సరఫరా అయ్యాయి.. పోలీసులు తీసుకున్న చర్యలపై వాకబు చేశారు. డ్రగ్స్‌ సమస్యను కేవలం పోలీసింగ్‌ అంశంగా కాకుండా భవిష్యత్‌ తరాల భద్రతకు సంబంధించిన సామాజిక బాధ్యతగా చూడాలన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా విద్యాసంస్థలు, కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మత్తు పదార్థాల కట్టడికి ఈగల్‌ ఫోర్స్‌ రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తుందని, వివిధ అంశాలను సిబ్బందితో వారు తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement