గద్వాల క్రైం: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత మధ్యవర్తిత్వ సేవలు అందిస్తుందని గద్వాల సివిల్ జడ్జి నిష్కా పత్రుడు అన్నారు. మంగళవారం కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లావ్యాప్తంగా ఉచిత మధ్యవర్తిత్వ సేవల గురించి ప్రజలకు తెలియజేసేందుకు చర్యలు తీసుకున్నామన్నా రు. కేసుల పరిష్కారం కోసం నిపుణులైన 11 మంది సిబ్బందికి శిక్షణ అందించామన్నారు. వైవాహిక, ఆస్తి, కుటుంబ, పొలం తగాదాలతోపాటు రాజీ కాదగిన కేసులను మధ్యవర్తిత్వం ద్వారా ఇరువర్గాల కక్షిదారులతో మాట్లాడి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మధ్యవర్తిత్వానికి అనుకూలమైన 2 వేల కేసులను గుర్తించి 148 కేసులను న్యాయమూర్తికి తెలియజేశామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
2న జూనియర్ బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు
గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు జూనియర్ బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షురాలు డీకే స్నిగ్ధారెడ్డి, కార్యదర్శి నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. 05.11.2006 తర్వాత జన్మించి, 65 కిలోల లోపు బరువున్న బాలికలు అర్హులన్నారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు పదో తరగతి ఒరిజినల్ మెమో, బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, బోనోఫైడ్ తీసుకురావాలన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 10 నుంచి 12 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 94407 26887, 99511 03371లను సంప్రదించాలని సూచించారు.
266 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 266 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,109, కనిష్టంగా రూ.4,890, సరాసరిగా రూ.5,131 ధరలు లభించాయి. అలాగే 53 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,159, కనిష్టంగా రూ.6,809, సరాసరిగా రూ.7,159 ధరలు పలికాయి.
ఎరువుల దుకాణాల్లో
ఆకస్మిక తనిఖీలు
మానవపాడు: ఎరువుల సరఫరా, బుకింగ్, నకిలీ ఎరువుల సమస్యల నేపథ్యంలో మంగళవారం అలంపూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు శివాంగిరెడ్డి ఎరువుల విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవపాడులోని మన గ్రోమోర్‌ను సందర్శించి ఎరువుల నిల్వలు, రైతులకు జరుగుతున్న సరఫరా బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై ఆరా తీశారు. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్, పీఓ వివరాలు, భౌతిక నిల్వల మధ్య సమన్వయం పరిశీలన, రైతుల నుంచి బుకింగ్‌పై ఫీడ్ బ్యాక్ సేకరణ, నకిలీ ఎరువుల సరఫరాను అరికట్టేందుకు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించామని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమారు తదితరులు పాల్గొన్నారు.
అకాడమిక్ రికార్డులు సమర్పించాలి: వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అకాడమిక్ రికార్డులను ఎప్పటికప్పుడు యూనివర్సిటీకి సమర్పించాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్‌తో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీచింగ్ డైరీలు క్రమం తప్పుకుండా నిర్వహించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు అకాడమిక్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల అభివృదికధ అవసరమైన చర్యలు చేపట్టాలని, అకాడమిక్ ప్రమాణాలపై మరింత మెరుగుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు చంద్రకిరణ్, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.


