ఇటీవల జూరాల ఆయకట్టు రైతులు నీటి కోసం ఎందుకు ఆందోళనలకు దిగాల్సి వచ్చిందో పాలకులు, ప్రతిపక్షాలు గ్రహించాలి. ఎల్‌నినో, వర్షాభావం వల్ల అని భావించినా.. నీటి నిర్వహణ, ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే ప్రధానం కారణాలు. స్వరాష్ట్రంలో 12 ఏళ్లు గడిచినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తికాకపోవడం విచారకరం. ఇప్పటికే రాంగ్ ఇంజినీరింగ్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నాం. జిల్లా రైతులకు మేలు చేసేలా ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్ల నిర్మాణంలో వేగం పెంచాలి.
– రాజేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్


