విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించాలి

Sep 30 2026 12:52 AM | Updated on Sep 30 2026 12:52 AM

అలంపూర్‌: గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యతోపాటు జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్‌లోని మాంటిస్సోరి పాఠశాలలో మంగళవారం నిర్వహించిన 70వ జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే విజయుడు క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందుతుందన్నారు. క్రీడలతో నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోనే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఎదగడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

జిల్లాస్థాయి క్రీడలు..

మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు హాజరయ్యారు. అండర్‌–14 విభాగంలో ఖోఖో విన్నర్‌గా ఎర్రవల్లి, రన్నర్‌గా వడ్డేపల్లి విద్యార్థులు నిలిచారు. వాలీబాల్‌లో విన్నర్‌గా మల్దకల్‌, రన్నర్‌గా కేటీదొడ్డి, కబడ్డీలో విన్నర్‌గా ధరూరు, రన్నర్‌గా మల్దకల్‌ పాఠశాలలు నిలిచాయి. అండర్‌– 17 ఖోఖో విభాగంలో విన్నర్‌గా వడ్డేపల్లి, రన్నర్‌గా కేటీదొడ్డి, కబడ్డీలో విన్నర్‌గా గద్వాల, రన్నర్‌గా వడ్డేపల్లి, వాలీబాల్‌లో విన్నర్‌గా కేటీదొడ్డి, రన్నర్‌గా గట్టు పాఠశాలలు నిలిచాయి. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ జయరాముడు, వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌, నాయకులు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, వెంకట్రామయ్యశెట్టి, ఎంఈఓ అశోక్‌కుమార్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి శ్రీనివాసులు, టోర్నమెంట్‌ కన్వీనర్‌ భరత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement