వర్షాలకు తడిసి రంగు మారిన పత్తిని వ్యాపారు లు కొనుగోలు చేయడం లేదు. పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయాలి. నాణ్యతలేని పత్తిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.
– సత్యారెడ్డి, రైతు, అయిజ
ఈసారి సరైన వర్షాలు కు రువలేదు. బోరుబావులు, కాల్వల ద్వారా నీటితడులిచ్చి, అష్టకష్టాలు పడి పత్తిని పండిస్తే తుఫాన్ పత్తిపంటను నాశనం చే సింది. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి.
– వరలక్ష్మి, మహిళా రైతు, అయిజ
ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన పత్తిని వెంటనే నిల్వ చేయకూడదు. తేమశాతం తగ్గేంత వరకు ఎండలో ఆరబెట్టాలి. రంగు మారిన, నాణ్యతను కోల్పోయిన పత్తిని వేరుచేయాలి. చెత్తాచెదారం కలువకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలి.
– వీరప్ప, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●


