తుంగభద్ర నదికి ప్రస్తుతం వస్తున్న వరదతో పరివాహక గ్రామాల్లో పూర్తి ఉపశమనం లభించదు. నది తీర గ్రామాల్లో ఇప్పటికే ఎక్కడికక్కడ పంటలు ఎండు ముఖం పట్టాయి. వచ్చిన నీరు వచ్చినట్లుగా వాడుతుంటే దిగువకు ఏమాత్రం రాదు. కాకపోతే ఈ నీటితో తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. అది కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే. – వీరన్న, రైతు,
పెద్దధన్వాడ, రాజోళి మండలం
స్పష్టత ఇవ్వలేం..
టీబీ డ్యాం, సుంకేసుల మధ్యలో కురిసిన వర్షాల కారణంగా ఈ వరద వస్తుంది. ఇది ఒక రకంగా రైతులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. పూర్తి ప్రయోజనమని చెప్పలేం. కానీ, వస్తున్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇండెంట్‌పై స్పష్టత ఇవ్వలేం. శుక్రవారం నాటికి తుంగభద్ర నదికి 17,100 క్యూసెక్కులు, ఆర్డీఎస్ కెనాల్‌కు 565 క్యూసెక్కుల నీరు వచ్చింది.
– రామదాసు, ఆర్డీఎస్ అధికారి
●


