పకడ్బందీగా భూముల రీసర్వే | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా భూముల రీసర్వే

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

కేటీదొడ్డి: భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ట్రెయినీ కలెక్టర్‌ రాజ్‌కుమార్‌ అన్నారు. కేటీదొడ్డి మండలం ఈసర్లపాడ్‌లో బుధవారం ప్రారంభమైన భూ సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో మొత్తం 73 సర్వేనంబర్లు ఉండగా.. 969.23 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 119.33 ఎకరాలు ఉండగా.. రీసర్వే ద్వారా హద్దులు నిర్ణయిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్‌ మాట్లాడుతూ.. భూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు, రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కరం చూపించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రీసర్వే చేపట్టిందన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వేను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మండల రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement