ప్రాచీన సంపదను కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

ప్రాచీన సంపదను కాపాడుకుందాం

Sep 23 2026 12:49 AM | Updated on Sep 23 2026 12:49 AM

అలంపూర్‌: ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకుందామని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం అలంపూర్‌లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ పర్యాటక వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి, నవబ్రహ్మ ఆలయాల సముదాయంలోని ప్రాంగణాలను విద్యార్థులు శుభ్రం చేశారు. అనంతరం ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వారోత్సవాలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రానికి వచ్చిన యాత్రికులకు ప్రాముఖ్యతను తెలియజేశామన్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలంటే పురాతన చరిత్ర కలిగిన ప్రాంతాలు పరిశుభ్రంగా, మౌలిక వసతులు ఉండాలన్నారు. విద్యార్థుల్లో సైతం పురాతన వారసత్వ సంపద ప్రాముఖ్యతతోపాటు సేవా దృక్పథం కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ రాజు, అధ్యాపకులు వెంకటరాణి, సుధారాణి, మౌనిక, పూర్ణిమ, రామచంద్రయ్య, రాముడు, ఆర్‌.రాముడు, రఘువీర్‌కుమార్‌, మల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement