నాకు 2017 నుంచి వికలాంగుల పింఛన్ వస్తుంది. అయితే రెండు నెలల నుంచి పింఛన్ ఆపేశా రు. దీనిపై అధికారుల ను అడిగితే వికలాంగుల పింఛన్‌కు అవసరమైన పర్సంటేజీ లేదని, పింఛన్ ఆపేశామని చెబుతున్నారు. నాకు ఒక కన్నుపూర్తిగా కనిపించడం లేదు. ఇదే విషయం చెబితే సర్టిఫికేట్ కావాలంటున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. నాకు ఎలాంటి ఆధారం లేదు. ఈ వయసులో పనిచేసుకునే శక్తి కూడా లేదు. నాకు పింఛన్ వచ్చేలా చూడండి.
– తిమ్మోజి, తనగల, రాజోళి మండలం
లోన్ ఇవ్వడం లేదు..
నేను మేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. 2024లో పీఎం విశ్వకర్మ పథకం కింద రూ.లక్ష లోను కోసం దరఖాస్తు చేసుకున్నా ను. అయితే ఇప్పటి వరకు లోను మంజూరు కాలేదు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. కలెక్టర్‌కు రెండుసార్లు ఫిర్యాదు చేశాను. నాకు లోను వచ్చేలా చేయండి.
– సుధాకర్, నాగర్‌దొడ్డి, మల్దకల్ మండలం


