చివరికి ఏమైతదో..! | - | Sakshi
Sakshi News home page

చివరికి ఏమైతదో..!

Sep 20 2026 12:51 AM | Updated on Sep 20 2026 12:51 AM

జోగుళాంబ గద్వాల

ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగానే ఉండబోతుంది.. వర్షపాతం సాధారణ స్థాయిలో లేకపోవడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోకి వచ్చే నీటి ప్రవాహాలు తగ్గాయి.. దీని ప్రభావంతో కృష్ణా, గోదావరి బేసిన్‌లో గతంలో కంటే నీటి లభ్యత భారీగా తగ్గిపోయింది. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో నీటిని కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా తాగునీటి సరఫరాకే వెచ్చిస్తుంది.

– ఈ నెల 18న అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పిన మాటలివి..

వానాకాలం సీజన్‌ మధ్యలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడంతో వారాబందీ పద్ధతిలో సాగుకోసం నీటిని వదులుతామని అధికారులు చెప్పారు. దీంతో ఆయకట్టు పరిధిలోని రైతులం వరిపంట సాగు చేశాం. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. మరో నాలుగైదు తడులిస్తే పంట చేతికొస్తుంది. ఇప్పుడేమో అధికారులు కాల్వలకు నీటిని వదలడం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీరు వదలాల్సిందే.

– శుక్ర, శనివారాల్లో జూరాల ఆయకట్టు రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టి చెబుతున్న మాటలివి..

గద్వాల: ఈసారి వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వాస్తవానికి వానాకాలంలో జూన్‌ ఆఖరి వారం మొదలుకొని జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. జూలై, ఆగస్టు మాసాల్లో 63 మి.మీ., వర్షపాతం తక్కువ నమోదైందంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 3.28 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 1.72 లక్షల ఎకరాల్లో పత్తి, 78 వేల ఎకరాల్లో వరి పంటలు సాగుచేశారు. అయితే సాగునీటి విడుదల నిలిపివేయడంతో ప్రాజెక్టుల కింద సాగు చేసిన ఆయకట్టుతోపాటు తీవ్రమైన కరెంట్‌ కోతలతో బోర్లు బావుల ఆధారంగా పండిస్తున్న పంటలు సైతం ఎండుముఖం పట్టాయి. దీంతో ఆయా పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు నిత్యం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి.

పంట చేతికొచ్చేది ఎలా..?

జిల్లాలోని జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద 1,83,573 ఎకరాల్లో రైతులు వరిపంట సాగచేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు ఉండగా.. లైవ్‌లో మాత్రం 6 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. ప్రాజెక్టుల కింద సాగైన పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే కనీసం ఇంకా రెండు నెలల పాటు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం జూరాలలో ఉన్నవాటిలో తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ నీటినే వచ్చే వానాకాలం వరకు తాగునీటి కోసం వినియోగించాల్సి ఉంటుంది. మరి ఈ లెక్కన రెండు నెలల పాటు పంటలకు సాగునీరు అందాలంటే ఎగువ నుంచి వరద రావాల్సిందే. ఈ నేపథ్యంలో పంటలు చేతికొచ్చేది ఎలా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

విద్యుత్‌ కోతలతో..

బోరు, బావుల కింద సాగుచేసిన పంటలకు సాగునీటిని అందించాలంటే ప్రధానంగా విద్యుత్‌ మోటార్లు అవసరం. జిల్లాలో సుమారు 85 వేల వరకు వ్యవసాయ మోటార్లు ఉండగా.. వీటికి ప్రతిరోజుకు 293.80 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతుంది. అయితే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో బావులు, బోర్ల కింద పంటలు సాగుచేసిన పంటలు సైతం ఎండుముఖం పడుతున్నాయి. అధికారులేమో 12 గంటల పాటు కరెంటు ఇస్తున్నామని చెబుతుండగా.. కేవలం ఐదారు గంటలే ఇస్తున్నారని, అది కూడా లోఓల్టేజీతో సరఫరా చేస్తుండడంతో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.

..న్యాయవాదులే

దేశ స్వాతంత్రోద్యమంలో పోరాడిన గొప్ప నాయకులంతా న్యాయవాదులే అని జిల్లా జడ్జి ప్రేమలత అన్నారు.

–8లో u

వర్షాధార పంటలు..

ప్రాజెక్టుల కింద ఉన్న పంటల పరిస్థితి ఇలా ఉంటే.. వర్షాధారిత పంటలు కూడా ఆందోళన కరంగానే ఉన్నాయి. మొత్తం 1.45 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. అయితే ఎల్‌నిన్‌ ప్రభావంతో జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత సెప్టెంబర్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో సాగుచేసిన 1.45 లక్షల ఎకరాల పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే వరుణుడు కరుణించాల్సిందే.

ప్రాజెక్టుల కింద కాల్వలకు సాగునీటి నిలిపివేత

నీటిని వదలాలని ఆయకట్టు రైతుల ఆందోళన

నాలుగైదు తడులిస్తే పంట

చేతికొస్తుందని ఆక్రందన

తాగునీటికే తొలి ప్రాధాన్యం

అంటున్న ప్రభుత్వం

మరోవైపు తీవ్రమైన విద్యుత్‌

కోతలతో ఎండుతున్న పంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement