ఎండుతున్న పంటలను కాపాడాలి: ఎంపీ డీకే అరుణ | - | Sakshi
Sakshi News home page

ఎండుతున్న పంటలను కాపాడాలి: ఎంపీ డీకే అరుణ

Sep 20 2026 12:51 AM | Updated on Sep 20 2026 12:51 AM

గద్వాల: జూరాల ప్రాజెక్టు పరిధిలోని గద్వా ల, ఆత్మకూరు ప్రాంతాల్లో సాగుచేసిన పంటలు కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. జూరాల ఆయకట్టుకు సాగునీరు అందక ఎండిపోతుండటంతో గద్వాల, ఆత్మకూరు ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నీరు విడుదల చేయాలని కోరుతూ రోడ్డెక్కి ధర్నా, నిరసన చేస్తున్నారన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి.. రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పంటలకు వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు ఎంపీ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement