వరి మాత్రమే పండుతది.. | - | Sakshi
Sakshi News home page

వరి మాత్రమే పండుతది..

Sep 20 2026 12:51 AM | Updated on Sep 20 2026 12:51 AM

జూరాల ఆయకట్టు పరిధిలో నాకున్న 16 ఎకరాల్లో వరిపంట సాగు చేశాను. ఇక్కడ వరి మాత్రమే పండుతుంది. మొదట్లో మూడురోజులకు ఒకసారి నీటిని వదులుతామని అధికారులు, రాజకీయ నాయకులు చెప్పారు. ఇప్పుడేమో మొత్తానికే నీళ్లు నిలిపేశారు. వేసుకున్న పంట ఎండిపోతుంది. గత్యంతరం లేక రోడ్డెక్కి ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి పంటలు కాపాడాలి.

– హన్మంతు, రైతు,

రేవులపల్లి, ధరూరు మండలం

మూడు రోజులకోసారైనా వదలాలి..

నెట్టెంపాడు కింద అర ఎకరా పొలంలో వరిపంట వేసుకున్నాను. మొదట్లో మూడురోజులకోసారి నీటిని ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక్కరోజు కూడా నీటిని ఇస్తలేరు. కనీసం పంట చేతికొచ్చే వరకు అయినా మూడురోజుకోసారి నీటిని విడుదల చేస్తే పెట్టిన పెట్టుబడి నష్టపోకుండా పంట చేతికొస్తుంది. లేకపోతే పెట్టుబడిపోయి అప్పులు మిగులుతాయి. – రాములు, రైతు,

మార్లబీడు, ధరూరు మండలం

ఆరుతడి పంటలే వేయాలి..

ఎల్‌నినో ప్రభావంతో ఈసారి జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైంది. కాబట్టి ప్రస్తుతం జూరాలలో అందుబాటులో నీటిని తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. రైతులు ఇబ్బంది పడకుండా ఉన్ననీటిని పొదుపుగా వినియోగించుకుంటూ ఆరుతడి పంటలే సాగుచేసుకోవాలి.

– కేశవరావు, ఎస్‌ఈ, ఇరిగేషన్‌శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement