నేను 18 ఎకరాల్లో పంటల సాగు చేస్తున్నా. స్మార్ట్‌ఫోన్ లేదు. ఇతరుల సహాయంతో యాప్‌లో ఎరువులను బుక్ చేద్దామని వెళ్తే.. ఒక్కొక్కరి సారి యాప్ ఓపెన్ కావడం లేదు. పంటలకు ఎరువులు వేసేందుకు అవస్థలు పడుతున్నాం. పంటలను ఎలా పండించాలో అర్థం కావడంలేదు. వ్యవసాయం అంటేనే భయమేస్తుంది. – సుంకన్న, రైతు,
గోకులపాడు, మానవపాడు మండలం
బుకింగ్ చేసుకోలేకపోతున్నాం
అన్ని రకాల ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నాం. యూరియా కోసం పైపాడ్‌లో బుక్‌చేస్తే.. మానవపాడు మండలం చెన్నిపాడులో బుక్ అయ్యాయి. దీంతో రవాణా ఖర్చు అధికమైంది. ఎరువుల బుకింగ్ కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. రైతులకు ఎరువుల కష్టాలు లేకుండా చూడాలి.
– సంజన్న, రైతు, పైపాడ్, వడ్డేపల్లి
ఇబ్బందులు లేకుండా చూస్తాం..
రైతులు యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి. ఇంకా నమోదు చేసుకోని రైతులు ఏఈఓలను సంప్రదించాలి. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ప్రతి డీలర్ షాపు వద్ద వలంటీర్లను ఏర్పాటు చేస్తాం.
– వీరప్ప, డీఏఓ
●


