మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గంప జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. దశమికట్ట వరకు పల్లకీ సేవ చేపట్టారు. గ్రామ పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని భక్తజనం దర్శించుకొని భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. దేవరగట్టులోని ఆలయానికి చేరుకున్న స్వామివారికి ప్రత్యేక పూజ ల అనంతరం తిరిగి ఆదిశిలా క్షేత్రానికి చేర్చారు. ప్రతి ఏటా గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు తెలిపారు. ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి పాల్గొన్నారు.


