సొసైటీలు ఆర్థికంగా బలపడాలి | - | Sakshi
Sakshi News home page

సొసైటీలు ఆర్థికంగా బలపడాలి

Aug 30 2026 1:09 AM | Updated on Aug 30 2026 1:09 AM

అయిజ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కేవలం రైతులకు రుణాలు ఇచ్చే వ్యవస్థగానే కాకుండా.. వారి ఆదాయం రెట్టింపు కావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ అబ్దుల్‌ నబి అన్నారు. అయిజ సింగిల్‌విండో ఆవరణలో నిర్వహిస్తున్న సూపర్‌ మార్కెట్‌ను గురువారం ఆయన పరిశీలించారు. సూపర్‌ మార్కెట్‌ ద్వారా ప్రతినెలా రూ. 40లక్షల టర్నోవర్‌ కావడంతో పాటు పురుగు మందుల దుకాణంతో ఏడాదికి రూ. 2కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ గద్వాల బ్రాంచ్‌ మేనేజర్‌ ప్రదీప్‌ కుమార్‌, సూపర్‌వైజర్లు రవికుమార్‌, కిరణ్‌, పీఏసీఎస్‌ సీఈఓ మల్లేష్‌ పాల్గొన్నారు.

హక్కులపై

అవగాహన ఉండాలి

అలంపూర్‌: విద్యార్థులకు తమ హక్కులను అవగాహన ఉండాలని అలంపూర్‌ జూనియర్‌ సివిల్‌కోర్టు జడ్జి ఆర్‌వీఎస్‌ఎస్‌ మిధున్‌తేజ అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం అలంపూర్‌ చౌరస్తాలోని బీసీ గురుకుల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని డార్మెంటరీలు, తరగతి గదులను న్యాయమూర్తి పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోక్సో చట్టం, బాలకార్మిక నిషేధ చట్టం ఇతర చట్టాలకు సంబంధించిన వీడియోలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, బాలకార్మిక వ్యవస్థతో కలిగే నష్టాలను వివరించారు. సమస్య ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో అలంపూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసులు, న్యాయవాదులు నారాయణరెడ్డి, నర్సింహులు, శ్రీధర్‌రెడ్డి, మధు, గజేంద్రగౌడ్‌, సిబ్బంది జహంగీర్‌ హుస్సేన్‌, సాయితేజ, పరశురాం పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీ ప్రధానిని చేయడమే లక్ష్యం

ఎర్రవల్లి: రాహుల్‌ గాంధీ దేశ ప్రధాని కావడమే కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల లక్ష్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ అన్నారు. ఒంగోలుకు చెందిన న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కాటూరు వెంకటేశ్వర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు చేపట్టిన రాగా ఫర్‌ రైస్‌ ఆఫ్‌ ఇండియా పాదయాత్ర శనివారం ఎర్రవల్లికి చేరింది. ఈ సందర్భంగా మండల కేంద్రం నుంచి బీచుపల్లి హనుమాన్‌ ఆలయం వరకు ఆయనతో కలిసి సంపత్‌ కుమార్‌ పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. దేశ పరిస్థితులు మారాలన్నా.. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలన్నా రాహుల్‌గాంధీ నాయకత్వం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడ్డెప్ప, వైస్‌ చైర్మెన్‌ కుమార్‌, షేక్షావలి ఆచారి, జోగుల రవి, వెంకటేశ్‌ యాదవ్‌, రుక్మాందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement