గద్వాల: జిల్లా కేంద్రంలోని భీమ్‌నగర్‌లో మున్సిపాలిటీకి చెందిన పదిశాతం స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న వైనంపై ‘సాక్షి’లో శుక్ర, శనివారం ప్రచురితమైన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. అక్రమ నిర్మాణం చేపడుతున్న సదరు వ్యక్తులకు శనివారం మున్సిపల్ కమిషనర్ జానకీరాంసాగర్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా పనులను తక్షణమే నిలిపివేయాలని చెప్పారు. అయితే సదరు నిర్మాణం చేపడుతున్న వ్యక్తులు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ చెప్పినట్లు తెలిసింది. దీనిపై మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌తో మాట్లాడి, చట్టపరమైన చర్యలతో మున్సిపల్ స్థలాన్ని కాపాడుతామని కమిషనర్ ‘సాక్షి’కి తెలిపారు.


