వడివడిగా గుడ్డెందొడ్డి | - | Sakshi
Sakshi News home page

వడివడిగా గుడ్డెందొడ్డి

Aug 24 2026 12:37 AM | Updated on Aug 24 2026 12:37 AM

అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ధరూరు మండలంలోని గుడ్డెందొడ్డి గ్రామ సమీపంలో నెట్టెంపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలో భాగంగా ఉన్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనలకు ఇటీవల కేబినెట్‌ ఆమోదం లభించింది. ఇది కేవలం సామర్థ్యం పెంపు మాత్రమే కాకుండా.. జిల్లా వ్యవసాయ భవిష్యత్‌ను మార్చగల మహాత్తర కార్యక్రమం అని నడిగడ్డవాసులు అభిప్రాయపడుతున్నారు.

రిజర్వాయర్‌ విస్తీర్ణం...

గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ దాదాపు 1,400 ఎకరాల్లో నిర్మించారు. దీని కింద సుమారు 64 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కానీ, సామర్థ్యం తక్కువగా ఉండటంతో వానాకాలంలో వచ్చే వరద నీటిని పూర్తిగా నిల్వ చేసుకోలేకపోతున్నారు. జూరాల ప్రాజెక్టుకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద ప్రవాహం ఉంటుంది. గుడ్డెందొడ్డి నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తే కేవలం 30 రోజుల్లోనే 15 టీఎంసీల సామర్థ్యం నింపుకోవచ్చు. దీంతో కర్ణాటక నుంచి వచ్చే నీటి విడుదలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది.

గద్వాల, సంగాల

మల్దకల్‌, తాటికుంట

మల్దకల్‌, నాగర్‌దొడ్డి

గట్టు, చిన్నోనిపల్లి

1.5

జిల్లాలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు.. టీఎంసీలు

1.5

1.59

0.6

రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంపునకు కేబినెట్‌ ఆమోదం

జల విద్యుత్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపకల్పన

ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే పనులు

పూర్తయితే తొలగనున్న సాగునీటి కష్టాలు

జిల్లా వ్యవసాయ భవిష్యత్‌ సమూల మార్పునకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement