విజ్ఞాన, విహార యాత్ర విజయవంతం | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన, విహార యాత్ర విజయవంతం

Aug 24 2026 12:37 AM | Updated on Aug 24 2026 12:37 AM

గద్వాల: విద్యార్థుల మేధో వికాసానికి నిర్వహించిన విజ్ఞాన, విహార యాత్రలు విజయవంతం అయ్యాయని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి పీఎంశ్రీ పాఠశాలలతోపాటు భవిత కేంద్రాలలో ఉండే 65 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 30 మంది ఐఈఆర్‌పీలు, స్పెషల్‌ ఎడ్యుకేటర్లు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు వరంగల్‌, హైదరాబాద్‌ విహార యాత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జూపార్కు, సాలార్‌జంగ్‌ మ్యూజియం, లుంబినీ పార్కు, వరంగల్‌లో వెయ్యిస్తంభాల గుడి, వరంగల్‌ కోట, వంటివి సందర్శించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement