అలంపూర్ రూరల్: నవబ్రహ్మ ఆలయాల దివ్యధామం అలంపూర్ క్షేత్రంలోని బాలబ్రహ్మేశ్వరస్వామికి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం ఆరుద్రోత్సవం వైభవంగా నిర్వహించారు. అలాగే రథంలో ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ఆలయం చుట్టు ప్రదక్షిణలు గావించారు. అనంతరం ఉమామహేశ్వరస్వామి దేవస్థానం వారిచే జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ మాధవరెడ్డి తదితరులు పాల్గొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారని అలంపూర్ ఆలయ ఈఓ దీప్తిరెడ్డి తెలిపారు.


