మల్దకల్: స్వయంభూ ఆదిశిలా క్షేత్రమైన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి చంద్రశేఖర్‌రావు, సిబ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు.


