ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి రద్దు

Jul 11 2026 12:36 AM | Updated on Jul 11 2026 12:36 AM

గద్వాల: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటనతో పాటు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నెల 13న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

వర్షపునీటిని ఒడిసిపట్టాలి

రాజోళి: వర్షపు నీరు వృథా కాకుండా, ఒడిసిపడితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వడ్డేపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో వర్షపునీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. సాధారణంగా ఇళ్లలో వినియోగించే నీటిని కూడా పొదుపుగా వాడుకోవాలని.. అనవసరంగా నీటిని వృథా చేయడం ద్వారా భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.

పీజీ సెంటర్‌లో సమస్యలు పరిష్కరిస్తాం

కొల్లాపూర్‌ రూరల్‌: పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొల్లాపూర్‌ పీజీ సెంటర్‌లో నెలకొన్న సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని పాలమూరు యూనివర్సిటీ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం రిజిస్ట్రార్‌ రమేష్‌బాబుతో కలిసి ఆయన కొల్లాపూర్‌ పీజీ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సెంటర్‌లో నెలకొన్న సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం బాలికల, బాలుర వసతి గృహలను, వసతులు, భోజనం పరిశీలించారు. ప్రొఫెసర్లతో కొంతసేపు సమస్యల గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుడూ విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాసులకు రావాలని, హాజరు శాతం తక్కువైతే చర్యలు ఉంటాయన్నారు. ఇటీవల సెంటర్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రిన్సిపాల్‌ మార్క్‌ పోలోనియస్‌పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మత్స్యకారుల

అభ్యున్నతికి కృషి

కొల్లాపూర్‌ రూరల్‌: మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్‌ మండలంలోని సింగోటంలో పర్యటించిన ఆయన మత్స్యకారులు ఆరాధ్యదైవం గంగమ్మ తల్లి గుడి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. శ్రీవారి సముద్రం చెరువు పరిసరాల్లో గుడి నిర్మించేందుకు స్థలాన్ని చూశారు. త్వరలో గంగమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని, సింగోటం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమిడిశెట్టి వెంకటస్వామి, నాయకులు రామచంద్రారెడ్డి, రామస్వామి తదితర నాయకులు పాల్గోన్నారు.

అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

వనపర్తి రూరల్‌: అంతరాలు లేని సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని, అందుకు ప్రజలను చైతన్యం చేసి పోరాడాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో సీపీఐ నాగర్‌కర్నూల్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుల మూడు రోజుల శిక్షణ తరగతుల ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్‌ లాంటి దేశాలు యుద్ధకాంక్షతో నరమేధాన్ని సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement