ఎర్రవల్లి: ఫిర్యాదుదారుల సానుకూల స్పందనే పోలీస్ పనితీరును తెలియజేస్తుందని.. ఆ దిశగా మరింత బాధ్యతగా ప్రతి పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఎస్పీ తోట శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌లో ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యాకర్స్, కిట్ ఆర్టికల్స్, స్టేషన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. పీఎస్ పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపట్టి.. నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అధికంగా నేరాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌గా గుర్తించి.. పోలీసు నిఘాను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి.. స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. రిసెప్షన్ సిబ్బంది స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని.. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని తెలిపారు. రౌడీ షీటర్స్, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని అన్నారు. స్టేషన్ రికార్డులైన పార్ట్–1, 5 పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సిబ్బందికి వర్టికల్ వారీగా విధులు కేటాయించాలని ఎస్‌హెచ్‌ఓకు సూచించారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పీఎస్ పరిధిలోని 11 కి.మీ. ఎన్‌హెచ్–44పై ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్‌ఐ రవి రాథోడ్ ఉన్నారు.


