ధరూరు: మండలంలోని నాగర్‌దొడ్డి పునరావాస కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌దొడ్డి పునరావాస కేంద్రంలో 90వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామన్నారు. మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందించేందుకు కొత్తగా వాటర్‌ట్యాంకు నిర్మించినట్లు తెలిపారు. కొత్త గ్రామాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇంటింటికీ నీటి సరఫరాను ప్రారంభించారు. అదే విధంగా పునరావాస కేంద్రంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించి.. లబ్ధిదారు చాకలి తిప్పన్న దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, రాజశేఖర్, భీంరెడ్డి, శేఖర్, బషీర్ పాల్గొన్నారు.


