రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రవాణ, పోలీసు శాఖ సంయుక్తంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గూడ్స్ వాహనాలలో సరుకులను మాత్రమే ట్రాన్స్‌పోర్టు చేయాలి. అయితే కొందరు ప్రజలను గూడ్స్ వాహనాలపై ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. రోడ్డు ప్రయాణాలు చేస్తున్న ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాలి. మద్యం, నిద్రలేమి, అవగాహన, సామర్థ్యం లేని వ్యక్తులు డ్రైవింగ్ చేయరాదు. అన్ని ప్రధాన రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల
●


