ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
– జీఎన్ శ్రీనివాస్,
వైస్ చాన్స్‌లర్, పీయూ
●


