అమ్రాబాద్: పదర మండలం ఉడిమిళ్ల సమీపంలోని వినాయకగుడి మాన్యంలోగల చిన్న వినాయకుడి విగ్రహం ఎదుట గుప్తనిధుల తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొంతమంది స్థానికులు ఈ నెల 13న రాత్రి గుడి ఎదుట జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది పరారుకాగా పెబ్బేరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్‌ఆర్‌ఓ వీరేష్‌గౌడ్‌ను వివరణ కోరగా తవ్వకాలు రెవెన్యూ భూమిలో ఉండటం వల్ల గ్రామ పంచాయతీ దృష్టికి విషయం తీసుకెళ్లామన్నారు. స్థానికులు ఉండటంతో గ్రామపెద్దల ఒత్తిడితో కేసు నమోదు చేయనట్లు సమాచారం.


