ఎర్రవల్లి: రాష్ట్రంలోని 35 గురుకుల (రెసిడెన్సియల్) జూనియర్ కళాశాల లు, 93 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీఆర్జేసీ సెట్– 2026 కు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కోఆర్డినేటర్ బి. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు మే 3వ తేదీన ఉంటుందని, మార్చి 2026 లో పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చన్నారు. దరఖాస్తు రుసుము రూ.200 ఉంటుందని, ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 040– 24734899, 78429 91708, 180024 52428 లను సంప్రదించాలని కోరారు.


