‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ
గద్వాల: ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని, పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం గాలికుంటు వ్యాఽ ది నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వాహనాన్ని కలెక్టరేట్‌లో ప్రారంభించారు.
ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలి
సంప్రదాయ పంటలతో పోలిస్తే ఆయిల్‌పాం సాగు చేస్తే 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం వస్తుందని కలెక్టర్ అన్నారు. ఆయిల్‌పాం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఐడీఒసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అధిరులు తదితరులు ఉన్నారు.
గ్యాస్ వినియోగదారులు
నిబంధనలు పాటించాలి
గద్వాల: గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే వినియోగదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్ రిజ్జాన్‌బాషా షేక్ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు అంటూ కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో బుధవారం కలెక్టర్ పట్టణంలోని రాఘవేంద్ర, ధనుష్, హెచ్‌పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యా స్ బుకింగ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధన ల ప్రకారం ప్రతి సిలిండర్ బుకింగ్‌కు మధ్య 45 రో జులు సమయం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అనంతరం కేజీబీవీ ల గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేందుకు సిలిండర్ల కొరత లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పౌర సరఫరా అధికారి స్వామికుమార్, ఏజెన్సీల ప్రతినిధులు ఉన్నారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని కలెక్టర్ రిజ్జాన్‌బాషా షేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల, ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వ హణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ ఉషారాణి, శివశంకర్, ప్రసాద్, సిబ్బంది, విద్యార్ధులు ఉన్నారు.


