అలంపూర్: ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలోని ప్రైవేటు పాఠశాలలో మంగళవారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించడంతో పాటు టీఎస్‌జీఎల్‌ఐ జెడ్పీ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్ సరెండర్ బిల్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్, విశ్రాంత ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. కేజీబీవీ యూఆర్‌ఎస్, సమగ్ర శిక్షణ ఉద్యోగులకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ కార్డుల జారీ ట్రస్టులో టీఎస్ యూటీఎప్‌కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం గద్వాల మండలం మదనపల్లికి చెందిన టీఎస్ యూటీఎఫ్ కార్యకర్త ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం మోహన్ కుమార్ ఇటివల మృతిచెందగా.. అతడి కుటుంబానికి టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి నుంచి రూ. 6లక్షల చెక్కును అందజేశారు. ఈ నెల 29న అలంపూర్‌లో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి.రమేశ్, ప్రధాన కార్యదర్శి ఎం.గోపాల్, రాష్ట్ర కార్యదర్శి రవి ప్రసాద్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ నాయుడు, నాయకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


