కొల్లాపూర్ సమీపం నుంచి కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతం వరకు రెవెన్యూ భూముల సేకరణకు ఏడాది కిందటే నోటిఫికేషన్ ఇచ్చాం. రైతుల నుంచి భూ యాజమాన్య పత్రాలను స్వీకరించాం. పరిహారం చెల్లింపు కోసం నేషనల్ హైవే అధికారులకు ఆ వివరాలు పంపించాం. త్వరలోనే పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
– భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్
కేంద్రం సానుకూలం..
ఆసియాలోనే మొదటిసారిగా భారీ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ హైవే నిర్మాణం, బ్రిడ్జి పనుల గురించి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందంగా వెళ్లి కలిశాం. అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినందున పనుల్లో వేగం పెంచుతామని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.
– ఎల్లేని సుధాకర్‌రావు,
బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి


