ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటగా రూ. 60లక్షలతో హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరునెలల పాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. ఇంజినీరింగ్ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్‌ను సందర్శించారు. సర్వేకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.


