ర్యాలంపాడుకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

ర్యాలంపాడుకు మోక్షం

Mar 11 2026 7:46 AM | Updated on Mar 11 2026 7:46 AM

గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌కు నాలుగేళ్ల క్రితం లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ.. 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు వానాకాలంలో ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. యాసంగి సీజన్‌లో రెండో పంటకు సాగునీరు అందించకుండా క్రాప్‌హాలిడే ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో ర్యాలంపాడు రిజర్వాయర్‌కు మరమ్మతు చేయాలని రైతులు ప్రతి ఏడాది ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు హైదరాబాద్‌, పుణె నుంచి ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రిజర్వాయర్‌ను సందర్శించి.. సర్వే చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎట్టకేలకు ర్యాలంపాడు రిజర్వాయర్‌ మరమ్మతుకు మోక్షం లభించింది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది.

రెండేళ్లకే లీకేజీలు..

గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల ప్రజలకు తాగునీటితో పాటు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శంకుస్థాపన చేశారు. 2009 వరకు పరుగులు పెట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. వైఎస్సార్‌ అకాలమరణంతో అసంపూర్తిగా నిలిచాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో మొత్తం 20 టీఎంసీల సామర్థ్యంతో ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ర్యాలంపాడు రిజర్వాయర్‌ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్‌ నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం.. గుత్తేదారు లోపభూయిష్ట నిర్మాణంతో రిజర్వాయర్‌ అందుబాటులోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి.

రిజర్వాయర్‌ మరమ్మతుకు రూ. 4.92 కోట్లు మంజూరు

సివిల్‌ గ్రౌంటింగ్‌ పరీక్షలకు రూ.1.66కోట్లు కేటాయింపు

రూ. 3.66కోట్లతో జలాశయం

ఆనకట్ట, తూములకు మరమ్మతు

త్వరలోనే ప్రారంభంకానున్న పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement