నారాయణపేట: రాష్ట్రంలో పంటల సాగును ఆధునికీకరించి రైతులకు అండగా నిలిచేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తుండగా.. పంటలపై పురుగు మందులు పిచికారీ చేసేందుకు తాజాగా డ్రోన్లు పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా పంటలకు పురుగు మందులు, సూక్ష్మ పోషకాలను అందించేందుకు డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తి మేరకు డ్రోన్లను సబ్సిడీపై అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
రూ.4 లక్షల రాయితీ..
తొలి దశలో జిల్లాకు 10 డ్రోన్లను పంపిణీ చేస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. యూనిట్ వ్యయం రూ.15 లక్షలు ఉండగా.. రూ.4 లక్షల రాయితీ ఇవ్వనున్నారు. రైతు ఉత్పత్తిదారు సంఘాలతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇస్తారు.
ఎస్‌ఎంఏఎం
పథకంలో..
తొలివిడతలో జిల్లాకు 10 కేటాయింపు
రాయితీపై రైతులకు పంపిణీ
ఎఫ్‌ఓపీలు, పీఏసీఎస్‌లకు ప్రాధాన్యం
పురుగు మందుల పిచికారీకి తప్పనున్న వెతలు


